Naaku Thochina Maata
Chapters
శ్రీ శివాయ గురవేనమః ఉదాహారము మహాశయులకు విజ్ఞప్తి: నేను డెబ్బదియాఱండ్లవాడను. చిన్నప్పటినుండి యభ్యాసమగు కవిత్వ పురాణాది ధోరణుల చాలించి నా నమశ్శివాయ జపముతో కాలముcబుచ్చుచున్నాడను. ఇట్లుండ బాపట్ల పటేల్ నగరమునుండి ఒక బ్రహ్మసంఘము వచ్చి నన్ను రెండు రోజులు బాపట్లలో నుండిపొమ్మని యాహ్వానించిరి. మొదట ఆహ్వానములో గమనాగమన భోజనములు మాత్రమే యిమిడియున్నవి. అచ్చట చేరుసమయమునకు పూర్ణకుంభాదులతో వేదవిజ్ఞానుల వేదపాఠాది మేళనములతో నెదుర్కొని స్వాగతాదులతో నొక వసతిలో ప్రవేశ##పెట్టిరి. మరునాటినుండి యేదియో చెప్పుమనిరి. పై సందర్భముతో నుపక్రమోపసంహారముగ నుపన్యసించుటకు నలవాటు తప్పియుండుటవలన నాకు తోచినమాట చెప్పెదనంటిని దానికి వా రంగీకరించి తగినయేర్పాట్లు చేసిరి. ప్రతిదినము ఉపన్యాసమందిరమునకుం బోవువేళకు నా దేవతార్చన సమయమున వేదపారాయణ చేయించుచు, సభకు ముందు కొంత స్వస్తి చెప్పించుచు వేదవిద్యాప్రధానముగ నీ యుపన్యాసములు నడిపించిరి. ఇట్లు ఇరువదియైదు రోజులు జరిగినవి. అనుకొనకుండ జరిగిన యుపన్యాసములు గాలికి పోకుండ శ్రీ నెమ్మాని సీతారామయ్యగారు, శ్రీ ఇనుపకుతిక వీరరాఘవశాస్త్రిగారు, శ్రీ కోటంరాజు సత్యనారాయణశర్మగారు వ్రాయ మొదలిడిరి. ఆ విధమున గ్రంథస్థము కావలసివచ్చిన ఈ యుపన్యాసములను శ్రీ నెమ్మాని సీతారామయ్యగారు ముగ్గురు వ్రాసిన ప్రతులను ఏకముచేసి హెచ్చుతగ్గుల సవరించి యేకముఖముగ ముద్రణార్హ మొనరించి, అందు తప్పొప్పుల సవరించి యత్యాసక్తితో నేతద్రూపమును సంపాదించిరి. ప్రతిదినము ఈ పేటలోనివారు గాక, ఊరిలోని వారుకూడ చాలామంది వచ్చి ముమ్మాటు తీర్థప్రసాదములc బుచ్చుకొనుట, శ్రద్ధగ ఉపన్యాసాదుల వినుటలతో నా హృదయ మానందతుందిల మొనరించిరి. అందరు అట్టివార లగుటచే పేరెత్తి చెప్పుటకును చెప్పకుండుటకును వీలులేకుండనున్నది. విషయము విశదమగుటకు కొన్ని పేర్లు మాత్రము గ్రహింపవలసి వచ్చెను. వెనుక చెప్పిన వసతిగృహము శ్రీ జమ్మలమడక వేంకటేశ్వరశర్మగారిది. శ్రీ దుడ్ఢు దక్షిణామూర్తి శాస్త్రిగారు ప్రతిదినము ఆరోగ్య విషయములో నా పరివారమునకు ఆయుర్వేద వైద్యము చేయుచూవచ్చిరి. దేవతార్చనవద్ద భక్తితో పాటలు పాడుచుండెడివారు. శ్రీ చింతలపాటి మహదేవశాస్త్రి, మరికొందరు తమ ఆస్తిని వెల్లడించుచు నీ కార్యమున మిక్కిలి పాల్గొనిరి. ఇcకనేమియు తోచక ఒకమాట చెప్పుచున్నాను. ఇది యంతయు బ్రహ్మ నిర్మాణము. నా దౌహిత్రుcడు చి|| చెరువు సత్యనారాయణశాస్త్రి పై సంఘము కోరికపై జీవితచరిత్రను వ్రాసియిచ్చినాడు. అదియును నిందు పొందు కూర్చబడినది. దీనిలో పాల్గొనినవారినెల్ల పరమేశ్వరుcడు దీర్ఘాయురారోగ్యైశ్వర్య సంపన్నులుగా చేసి, నాకన్న నుత్తములైన పండితోత్తముల వాగ్ధోరణుల నెల్లకాలము వినుచు, విన్నదాని ననుష్ఠించుచు నైహికాముష్మిక సౌఖ్యసంపన్ను లయ్యెదరుగాక! అని దీవించుచు ఇంతతో ముగించుచున్నాను. దోషజ్ఞులకు వందనములు. చందోలు, ఇట్లు 13-2-72 »y®²…[xmsÖýÁ LSxmnsVª«sƒyLS¸R…VßáaSzqsòQû.